ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసన్న) గెలుపుతోనే ఒంగోలు నియోజకవర్గ అభి వృద్ధి సాధ్యమని, ఎమ్మెల్యేగా ఆరోసారి ఆయన గెలిచి సిక్సర్ సాధించి మరింత అభి వృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని బాలినేని సతీమణి శచీదేవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 24వ డివిజన్ బండ్ల మిట్ట, మంగలిపాలెం, పోకల బజారు, ట్రావెల్స్ బంగ్లా రోడ్డులో సోమవారం మహిళలతో మమేకం-స్త్రీ శక్తితో శబీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని శచీదేవి, వారి కోడలు బాలినేని శ్రీకావ్య ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలినేని శచీదేవి మాట్లాడుతూ 24వ డివిజన్లో లో సుమారు రూ.7 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులను వాసన్న పూర్తిచేశారని చెప్పారు. అభివృద్ధి ఎక్కడ అనే ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్పారన్నారు. డివిజన్లో 4.25 కోట్లతో షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేశారన్నారు. రూ.1.50 కోట్లతో నాడు- నేడు కింద పాఠశాలలను అభివృద్ధి
చేశారన్నారు. రూ.40 లక్షలతో ఫిష్ మార్కె రూ.75 లక్షలతో రోడ్లు వేశారని వివరించారు. ఇవి కాకుండా అనేక చిన్నచిన్న పనులు ఎన్నో చేశారని తెలిపారు. కులమతాలు, పార్టీలు చూడకుండా డివిజన్ లోని అర్హులైన పేదలు 624 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని, మరో 94 పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా ఇవ్వలేకపోయామన్నారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ మాట్లాడుతూ ..తాను ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండి వాసన్న సహకారంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తు న్నట్లు తెలిపారు. అభివృద్ధికి మారుపేరైన వాసన్నను మరోసారి గెలిపించుకుంటే డివిజన్ ప్రజలకు మరింత మేలు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని, ఎమ్మెల్యేగా వాసన్నను. ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, పద్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు సువర్ణ, ఏపీ విద్యుత్ బోర్డు డైరెక్టర్ జిళ్లెళ్లమూడి శారద, కార్పొరేటర్లు సర్తాజ్, మాజీ కార్పొరేటర్ ఝాన్సీ, పశుసంవ ర్ధకశాఖ చైర్మన్ రాధ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగనన్నను చూస్తే బాధేసింది: బాలినేని శచీదేవి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైఅసాంఘిక శక్తులు రాళ్లదాడి చేసి తీవ్రంగా గాయపరచడం చూసి బాధేసిందని బాలినేని శచీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 24వ డివిజన్ లో మహిళలతో మమేకం-స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. జగనన్న అదృష్టవశాత్తూ రాళ్ల దాడి నుంచి గాయంతో బయటపడ్డారని, అదే తగలరాని చోట తగిలితే అతని ప్రాణా నికే ప్రమాదమని, అది ఊహించడానికే భయంగా ఉందని శచీదేవి అన్నారు. ఇటు వంటి ఘటనలు మంచి సంప్రదాయం కాదన్నారు. ఏదైనా ఎన్నికల క్షేత్రంలో చూసుకోవాలే తప్ప ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకూడదని ఆమె ఆకాంక్షిం చారు.




