ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సిపి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తన నివాసంలో మండలంలోని శేషమావారిపాలెం గ్రామానికి చెందిన మచ్చు యలమంద, మచ్చు ఏడుకొండలు ఆధ్వర్యంలో పలువురికి వైఎస్ఆర్సిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దొనకొండ గ్రామానికి చెందిన షేక్ హబీబుల్లా, హరీబుల్లా, అబ్దుల్లా తదితరులు వైఎస్ఆర్సిపి లో చేరారు. కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి మహేష్), స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి, దొనకొండ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కురిచేడులో సుడిగాలి పర్యటన
దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి కురి చేడు మండలంలో సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఎన్.ఎస్.పి. అగ్రహారం, పెద్దవరం, బయ్యవరం, బోధనం పాడు, దేవనకొండ, మర్లపాలెం గ్రామాలలో పర్యటించారు. ఈ నెల 18న తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని, కార్యక్రమానికి అందరూవచ్చి.. జయప్రదం చేయాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి తనకు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నందిని, మండల యం.పి.పి. బెల్లం కోటేశ్వరమ్మ, జడ్.పి.టి.సి. నుసుం వెంకట నాగిరెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, మాజీ యం.పి.పి. వీరగంధం కోటయ్య, మండల వైకాపా కన్వీనర్ యన్నాబత్తుల సుబ్బయ్య, యన్.ఎస్.పి. అగ్రహారం మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.






