కాంగ్రెస్ పార్టీ లో చేరిన షేక్ గౌస్-బీ జే పీ నీ వీడి కాంగ్రెస్ గూటికి -బేగంపేట ప్రకాష్ నగర్ లో పట్టున్న మైనార్టీ నేత గా గుర్తింపు.

బేగంపేట డివిజన్ లో ముస్లిమ్ మైనార్టీ లతో పాటు ప్రకాష్ నగర్ లో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్న నాయకుడు షేక్ గౌస్ బీ జే పీ నీ వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ ప్రాంతంలో లీడర్ గౌస్ భాయ్ అంటూ
ప్రతి ఒక్కరూ ఆయనను ఆప్యాయంగా పలకరిస్తూ, స్నేహ పూర్వకంగా మెలుగుతుంటారు.కొద్ది కాలం క్రితం గౌస్ బీ జే పి లో చేరారు.అయితే ఇటీవల దానం నాగేందర్ ను సికిందర్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.
దానం నాగేందర్ తో ఎంతో కాలంగా షేక్ గౌస్ కు సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఈ నేపద్యం లో దానం పిలుపు మేరకు షేక్ గౌస్ బీ జె పీ నీ వీడి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సికింద్రబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ , డి సి సి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి లు షేక్ గౌస్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ బేగంపేట డివిజన్ లో ముస్లిమ్ మైనార్టీ లతో పాటు అన్ని వర్గాల ప్రజల తో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడు షేక్ గౌస్ కాంగ్రెస్ పార్టీ లోకి రావడం తమకెంతో సంతోషం గా వుందన్నారు.గతం లో బేగంపేట డివిజన్ కంటేస్తెడ్ కార్పొరేటర్ గా.సనత్ నగర్ నియోజక వర్గం ఏ బ్లాక్.బీ బ్లాక్ అధ్యక్షునిగా,డివిజన్ అధ్యక్షునిగా కూడా ఆయన పని చేశారని.సనత్ నగర్ ,కూకట్ పల్లి నియోజక వర్గాలతో పాటు నగర కాంగ్రెస్ కమిటీ లో కూడా పనిచేసిన అనుభవం గౌస్ కు వుందన్నారు. షేక్ గౌస్ మాట్లాడుతూ తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్త నన్నారు. పార్టీ తనకు డివిజన్ అధ్యక్షుడిగా, ఏ బ్లాక్.బీ బ్లాక్ అధ్యక్షునిగా కాంటెస్ట్ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందన్నారు.కొన్ని కారణాల వల్ల తాను బీ జే పీ లో చేరాల్సి వచ్చిందన్నారు.అయితే దానం తో తనకు వున్న పరిచయాలతో ఆయన ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ లోకి రావడం తన సొంత ఇంటి కి వచ్చినట్లు సంతోషంగా వుందన్నారు.సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వున్న దానం విజయానికి తన వంతు కృషి చేస్తానని గౌస్ తెలియజేశారు.గౌస్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *