దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వేలాదిగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దర్శి రోడ్లన్నీ జనంతో కిక్కిరిశాయి. ఈ సందర్భంగా జనాన్ని చూసి అభివాదం చేస్తూ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు క్రేన్తోతో గజమాలలు వేసి.. స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ ప్రసాదెడ్డి మాట్లాడుతూ …దర్శిలో తన 20 సంవత్సరాలుగా బూచేపల్లి కుటుంబం సేవకుల్లా పని చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడూ తాను దర్శికే సేవలందిస్తానన్నారు. తాము పదవిలో ఉన్నా లేకపోయినా దర్శి నియోజక వర్గంలో కులమతాలకతీతంగా అన్ని వర్గాలకూ పని చేస్తున్నట్లు తెలిపారు. తనను తన తమ్ముడుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారని, తమ మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో తనకు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా తనకు కురిచేడు, దొనకొండ మండలాలకు తాగునీరు, సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో తాను ఎప్పుడూ అభివద్ధి కోసం కషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ …తన తమ్ముడు శివను ఎమ్మెల్యేగా, తనను
ఎంపీగా గెలిపిస్తే అండగా ఉంటామన్నారు. నియోజకవర్గానికి అన్ని విధాలా అభివద్ధి, సంక్షే మానికి తోడ్పడతానన్నారు. ఈ సందర్భంగా ముందుగా రాజంపల్లి ముసి సమీపాన ఉన్న ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, రాష్ట్ర మంత్రి, మేరుగ నాగార్జున, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణితో కలిసి దగ్దాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీలో ప్రజలకు అభిమానం చేస్తూ గడియార స్తంభం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈఆర్ ఓ ఎంవిఎస్ లోకేశ్వరరావుకు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ రెడ్డి తో పాటు శివ ప్రసాద్ రెడ్డి సతీమణి నందిని కూడా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని పలు మండలాల మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ కన్వీనర్లతో పాటు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
తండ్రికి నివాళులర్పించిన బూచేపల్లి
-మద్దతుగా హాజరైన మంత్రి మేరుగు, పార్టీ నాయకులు
వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్ర సాదరెడ్డి గురువారం దర్శిలో నామినేషన్ వేసే ముందు చీమకుర్తిలోని బూచేపల్లి ఘాట్లో తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డికి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. తన తండ్రి ఆశయాలను గుర్తు చేసు కున్నారు. ఆ సమయంలో శివప్రసాదరెడ్డి తల్లి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ భావోద్వే గానికి గురై కొడుకు శివప్రసాదరెడ్డిని హత్తుకు న్నారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డికి మద్దతుగా జిల్లా ఇన్చార్జి మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున హాజరవగా, చీమకుర్తి మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













