బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్ లో శనివారం నిర్వహించిన రోటరీ యూత్ లీడర్ షిప్ కార్యక్రమం సందడిగా సాగింది.
రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్,
శ్రీ శక్తి కాలేజ్ హోటల్ మేనేజ్ మెంట్ మరియు ఐ హెచ్ ఎం శ్రీ శక్తి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు మరియు ఉద్యోగ నైపుణ్యాలుపై వక్తలు ప్రసంగించారు. విద్యార్థులు తమ భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో ఉన్నతమైన వ్యవహార శైలి, యోగ ప్రాముఖ్యతను ధ్యాన్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ జ్యోతి రెడ్డి, రాజగోపాల్, మూర్తి వడపల్లి, శ్యాం పాటిబండ్ల, రాంప్రసాద్, సురేష్ గుప్తా, ఇండియా టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ కృపాకర్, యాస్టర్నో ఓవర్సీస్ కన్సల్టెన్సీ వంశీ మరియు కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రొటేరియన్ సత్యపింజల, కళాశాల ప్రధానోపాధ్యాయులు అనిత చంద్రన్, అనీష్ బెనర్జీ పాల్గొన్నారు.


