ఒంగోలు పట్టణంలోని 48వ డివిజన్లో పార్టీ జాయింట్ సెక్రటరీ షేక్ జానీ, డివిజన్ అధ్యక్షుడు పసుపులేటి వీరు ఆధ్వర్యంలో ఆదివారం 40 కుటుంబాలకు చెందిన టిడిపి, జనసేన వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బైపాస్ రోడ్ ప్రక్కన ఉన్న జానీ ఆటోకన్సల్టెన్సీ వద్ద షేక్ జానీ మనువడు జాహిద్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని చిరంజీవి జాహిదన్ను ఆశీర్వదించారు. అనంతరం డివిజన్కు చెందిన సాదిక్, నిజాం, వెంకటేశ్వర్లు, అంజీ, కోటి, భరత్, భాష(పండ్లకొట్టు), రహీమ్, షరీఫ్, ఇస్మాయిల్, జమీల్, అబ్దుల్లా, ప్రేమ్ కుమార్, ఏసు, వెంకటేశ్వర రెడ్డి, నాగూర్, రఫీ, కిరణ్, మౌళాలి, రహంతుల్లా, ఖుషి, సమీనా, తహసీన్, సాధికున్నిషా, రబీనా, ప్రకాశ్, రసూల్, ఖాశిం, మదార్ వలి, హుస్సేన్తో పాటు వారి స్నేహితులు అధిక సంఖ్యలో పార్టీలో చేరారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే పరమావదిగా పరిపాలన చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రజలను మరోసారి మభ్య పెట్టెందుకే కూటమి కట్టారని అన్నారు. కూటమి చేస్తున్న అసత్య ఆరోపణలను, దుష్పచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి పిడుగు శేషి రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 48వ డివిజన్ అధ్యక్షుడు పసుపులేటి వీరు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ జానీ, రాష్ట్ర నాయకులు గొర్రెపాటి శ్రీనివాస రావు, బ్రహ్మా రెడ్డి, గురవా రెడ్డి, బొప్పర జ్యోతి, పల్లా అనురాధ, గృహలక్ష్మి, రమణమ్మ, మాధవి, బత్తుల స్టీఫెన్, మాధవ, బాదులు, ఏడు కొండలు, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని పార్టీశ్రేణులు గజ మాలతో ఘనంగా సన్మానించారు.





