పదవ తరగతి ఫలితాలలో తాళ్లూరు ఎబీసీ హైస్కూల్ విజయభేరి

2024 పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తాళ్లూరు మండలంలో ఎబీసీ హైస్కూల్ విద్యార్థులు విజయభేరీ మోగించారు. పాఠశాలలో 588 మార్కులు సాధించి మండలంలో మొదటి ర్యాంక్ సాధించారని ఎబీసీ హైస్కూల్ ప్రిన్సిపాల్ కె వెంకట్వేర రావు తెలిపారు. మొత్తం 57 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 57 మంది విద్యార్ధులు పాస్ అయ్యి నూటికి నూరు శాతం విజయం సాధించారు. అందులో ఫస్ట్ క్లాస్ లో 48 మంది, సెకండ్ క్లాస్ లో 8 మంది, ధర్డ్ క్లాస్ లో ఒక్కరూ విజయం సాధించారు. 500 మార్కులు పైన 22 మంది సాధించారు. అందులో కె అనీష్ రెడ్డి (588) మార్కులు సాధించి మండల మొదటి స్థానంలో నిలువగా, తేజ ప్రకాష్ రెడ్డి (585)), బి సూర్య ప్రకాశ్ (583), కె మౌనిక (568), కె భవిష్య (567), జి వాసు దేవ రెడ్డి (565), ఎం శ్రీజ (564),కె సృజనేష్ (561) మార్కులు సాధించినట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కె కాలేషా బాబు, ఉపాధ్యాయులు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *