పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు 588, 587 మార్కులతో మండలంలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. తాళ్లూరు ఏబీసీ స్కూల్బీకి చెందిన కె.అనీష్ రెడ్డి (588) మార్కులతో మండల మొదటి స్థానం, శ్రీ సరస్వతి విద్యాసంస్థకు చెందిన గొల్లపూడి మౌనిక (587) మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలలో 316 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 205 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ జి.సుబ్బయ్య తెలిపారు.
పదవ తరగతి ఫలితాలలో తాళ్లూరు ఎబీసీ హైస్కూల్ విజయభేరి
2024 పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తాళ్లూరు మండలంలో ఎబీసీ హైస్కూల్ విద్యార్థులు విజయభేరీ మోగించారు. పాఠశాలలో 588 మార్కులు సాధించి మండలంలో మొదటి ర్యాంక్ సాధించారని ఎబీసీ హైస్కూల్ ప్రిన్సిపాల్ కె వెంకట్వేర రావు తెలిపారు. మొత్తం 57 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 57 మంది విద్యార్ధులు పాస్ అయ్యి నూటికి నూరు శాతం విజయం సాధించారు. అందులో ఫస్ట్ క్లాస్ లో 48 మంది, సెకండ్ క్లాస్ లో 8 మంది, ధర్డ్ క్లాస్ లో ఒక్కరూ విజయం సాధించారు. 500 మార్కులు పైన 22 మంది సాధించారు. అందులో కె అనీష్ రెడ్డి (588) మార్కులు సాధించి మండల మొదటి స్థానంలో నిలువగా, తేజ ప్రకాష్ రెడ్డి (585)), బి సూర్య ప్రకాశ్ (583), కె మౌనిక (568), కె భవిష్య (567), జి వాసు దేవ రెడ్డి (565), ఎం శ్రీజ (564),కె సృజనేష్ (561) మార్కులు సాధించినట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కె కాలేషా బాబు, ఉపాధ్యాయులు అభినందించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం లో పది విద్యార్థులు నూటికి నూరు శాతం పాస్ అయ్యి విజయం సాధించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల డైరెక్టర్లు కు అభినందనలు తెలిపారు.








