శ్రీ హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర సందర్భంగా మంగళవారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజక వర్గ పరిధి లోని
పలు ఆలయాలు, మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలో
భోలక్ పూర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అదేవిధంగా గొల్ల కొమురయ్య కాలనీ, జబ్బార్ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే
వెంట బన్సీలాల్ పేట డివిజన్ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, ఏసూరి మహేష్, ప్రేమ్ కుమార్, వెంకట్, నిర్వహకులు శ్రీనివాస్ యాదవ్, రాజు, సతీష్, మనీష్, సాయి, శాంతి కుమార్ తదితరులు ఉన్నారు.
రామ్గోపాల్. పేట డివిజన్ పరిధిలోని కాచిబౌలి హనుమాన్ దేవాలయం లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా నల్లగుట్ట మార్కెట్, ఓల్డ్ బోయిగూడలోని అంజయ్య కాంప్లెక్స్, ఆర్ పి రోడ్ పెద్దమ్మ టెంపుల్, సుభాష్ రోడ్ గోల్డెన్ బ్యాంగిల్ స్టోర్, కురుమ బస్తీ, సుభాష్ రోడ్, పాన్ బజార్ బస్తీలలో ఏర్పాటు చేసిన శ్రీ వీరాంజనేయ స్వామి మండపాలను దర్శించుకుని ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వహకులు ఆయనను సన్మానించారు. పూజలలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సనత్ నగర్ డివిజన్ లోని అశోక కాలనీ శ్రీ వీర హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, నిర్వహకులు రాజీవ్ సింగ్, నాయకులు షౌకత్, సంజీవ్ సింగ్, అక్షయ్, శివశంకర్ తదితరులు ఉన్నారు.




