పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తాళ్లూరు మండల మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి కోట అనీష్ రెడ్డి (588) ని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అభినందించారు. తాను ఉత్తమ మార్కులు సాధించటానికి ఎబీసీ హైస్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు, ఉపాధ్యాయ సిబ్బంది పోత్సాహంతో, సహకారంతో సాధించానని చెప్పారు. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని దీవించారు. ఎబీసీ హైస్కూల్ కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, విద్యార్థి బంధువులు రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

