ముండ్లమూరు మండలం లక్ష్మీ నగర్ గ్రామంలో బుధవారం జరిగిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. శాస్త్రయుక్తంగా గత రెండు రోజుల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూడవరోజు అభయాంజనేయ స్వామి ప్రతిష్ట మహోత్సవం, బొడ్డు రాయిఏర్పాటు శాస్త్రయుక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గత మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మూడవరోజు వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

