ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు-జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహ కరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. తాళ్లూరు మండలం శివరాంపురం, దర్శి మండలం వీరాయపాలెం, రాజం పల్లి గ్రామాల్లో బుధవారం నిర్వ హించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా సదస్సులు ఏర్పాటు చేసి వారిలో ధైర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో వివా దాలకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల వేళ బెదిరింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని అయ్యా అవగాహన సదస్సులలోదర్శి డీఎస్పీ హెచ్చరించారు. ఆయా అవగా హన సదస్సుల్లో దర్శి డీఎస్పీ అశోకవర్ధన్, సీఐ సమీముల్లా, తహసీల్దార్లు మహమ్మద్ హుస్సేన్, సుజాత, ఎంపీడీవోలు కేవై. కీర్తి, హనుమంతరావు, తాళ్లూరు, దర్శి ఎస్సైలు రమ ణయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి

దర్శి మండలం లో పలు గ్రామాల్లో ఓటు హక్కు పై అవగాహన సదస్సులు నిర్వహించారు.
అర్హులైన ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. దర్శి మండలంలోని రాజంపల్లిలో బుధవారం రాత్రి ఓటర్లకు జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కల్గించాలని చూస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ …ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్ర శాంతంగా సాగేందుకు భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాజంపల్లిని సమస్యాత్మక గ్రామంగా గుర్తించినందున ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చామన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పా ల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసందర్భంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కట్టుబడి ఉంటామని ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేక సాయుధ దళాలు సాహస విన్యాసాలు ప్రదర్శించి ప్రజల్లో మనోధైర్యం నింపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సి.శైర్యమన్ పటేల్, దర్శి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు, డీఎస్పీ అశోక్ వర్ధన్రెడ్డి, తహసీల్దార్ జి.సుజాత, సీఐ షేక్ షమీముల్లా పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆధ్యర్యంలోతూర్పు వీరాయపాలెంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *