భక్తులకు కొంగు బంగారం గుంటి గంగ భవాని అమ్మవారు – గుంటిగంగ భవాని అమ్మవారు తిరునాళ్ల ప్రారంభం

తాళ్లూరు మండలంలోని గుంటిగంగలో కొలువై ఉన్న గంగాభవానీ అమ్మవారు తిరునాళ్ల గురువారం ప్రారంభమైనది. జిల్లా ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవదాయ శాఖ ఏర్పా ట్లుచేసింది. ఏటా చైత్రబహుళ విదియ రోజున గంగా భవానీ అమ్మ వారికి తిరునాళ్ల నిర్వహించటం ఆనవాయితీ. సోమవరప్పాడు, తూర్పుగంగవరం, రామభద్రాపురం గ్రామాల్లో ఉత్సవాలు బుధవారం రాత్రి సోమవరప్పాడు గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం గురువారం ఉదయం 6 గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గతంలో గంగమ్మకు మొక్కుబడిగా రాజకీయ పార్టీలు పోటాపోటీగా అ ధికసంఖ్యలో విద్యుత్తుప్రభలు ఏర్పాటుచేసి పలు సాంస్కృతిక కార్య క్రమా లు నిర్వహిస్తుంటారు. ఈఏడాది ఎన్నికల కోడ్ ఉన్నందున పార్టీపరంగా కార్యక్రమాలు ఏర్పాటుచేసే అవకాశంలేదు. తిరునాళ్ల ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ వైవీ రమణయ్య తెలిపారు. తిరునాళ్లకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆయా సత్రాల్లో ఉచిత భోజన వసతికి ఏర్పాట్లు చేశారు.

గంగమ్మ పేరు ఇలా..
గంగాభవానీ గుడికి దక్షిణంవైపు రాతి గుండు కిందుగా ఒక నీటి ధార ప్రవహిస్తూ ఉండేది. పూర్వం దీనిని గుండుగంగ అని పిలిచే వారు. చుట్టుప్రక్కలగ్రామాల వారు కాలువ తవ్వి ఆనీటితో తమచ వుడు భూములను పంట భూములుగా మార్చుకునేందుకు యత్నిం చారు. ఆ రాతి గుండును తొలిగిస్తే పెద్దజల ఉంటుందని భావించి ఆయా గ్రామాలకు చెందిన రైతు లు రాతిగుండును తొలగించారు. జల పెరగకపోగా పెద్దగుంత ఏర్పడింది. అలా అక్కడవెలసిన గుంట గంగ కాలక్రమేణ గుంటిగంగగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *