పద్మశ్రీ దలవాయి చలపతిరావుని సత్కరించిన ప్రకాశం బిజెపి నేతలు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీ సత్య సాయి జిల్లా, ధర్మవరం తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి అభ్యర్థి వై. సత్య కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ధర్మవరం పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార నిమిత్తం ధర్మవరం వెళ్లిన ప్రకాశం జిల్లా మహిళా మోర్చా నాయకులు, మీడియా ఇంచార్జ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తదితర ఇన్చార్జీలు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి వై సత్య కుమార్ సతీమణి వెంట ప్రచారం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆ సందర్భంగా 2020 సంవత్సరంలో భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు పొందిన తోలుబొమ్మలాటలు, తోలుబొమ్మల తయారీ లో తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి ప్రముఖ కళాకారులు దలవాయి చలపతిరావు మరియు వారి అర్ధాంగి సరోజనమ్మ లను కలిసి వారిని సత్కరించారు. అప్పటి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు పొందిన వారి జీవిత విశేషాలను అడిగి తెలుసుకున్నారు, వారి ఆశీర్వాదం పొందారు.

ఈ సందర్భంగా మీడియా ఇన్ఛార్జి ధనిశెట్టి రామునాయుడు మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలమని చెప్పగానే వారు ఎంతో సాదరంగా ఆహ్వానించి వారు స్వీకరించిన అవార్డుల గురించి చాలా చక్కగా వివరించారని, తోలుబొమ్మలాటల కళలో వారు తమ జీవితాన్ని ధారబోశారని, 500 మందికి పైగా శిష్యులను కలిగి, తోలుబొమ్మలాటలు కలను భావితరాలకు అందించారని శ్లాంఘించారు. తద్వారా భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డుతో వారు తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారని వివరించారు. అనంతరం రామాయణ ఘట్టంలోని పలు సందర్భాలను తోలుబొమ్మలతో చాలా చక్కగా ప్రదర్శించి చూపారని తెలిపారు.

పద్మశ్రీ దలవాయి చలపతిరావుని కలిసిన వారిలో సంకరపు జయ శ్రీ, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయరావు, కార్యదర్శి తీగల సత్యవతి, మహిళా మోర్చా జిల్లా మహిళా కార్యవర్గ నాయకురాలు చిట్టా తిరుమల, కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి, ప్రకాశం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక లక్ష్మణ్ మరియు ప్రకాశం జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *