సత్యకుమార్ ఎన్నికల నామినేషన్ ర్యాలిలో హల్చల్ చేసిన ప్రకాశం బిజేపి నేతలు – దక్షిణాదిన మరి రాష్ట్రంలో బిజెపి అన్ని స్థానాలను గెలుచుకుంటుంది -మహిళామోర్చా ప్రధానకార్యదర్శి బి. విజయరావు.

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమి శాసనసభ అభ్యర్థి, బిజేపి నేత వై. సత్య కుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ముందుగా బిజెపి తెలుగుదేశం జనసేన అభిమానులు కోలాహలముతో ధర్మవరం నగరంలో ఊరేగింపు నిర్వహించారు.
ఈ ఊరేగింపులో ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు నేతృత్వంలో సత్య కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ పలువురు ప్రకాశం జిల్లా బిజెపి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ రావు మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో మరి దక్షిణాదిన బిజెపి గణనీయమైన విజయాన్ని నమోదు చేస్తుందని, ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్య కుమార్ విజయాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అరాచక పాలన అంతమవడానికి కూటమి అభ్యర్థుల విజయానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని, దానికి తగ్గ సకారాత్మక ఫలితం కూడా వస్తుందని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టు లభిస్తుందని వారు తెలిపారు.
సత్య కుమార్ నామినేషన్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నుండి ధర్మవరం వెళ్లి హల్చల్ చేసిన వారిలో ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్& జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, మహిళా మోర్చా జిల్లా మహిళా కార్యవర్గ నాయకురాలు చిట్టా తిరుమల, కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక లక్ష్మణ్ మరియు ప్రకాశం జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు అనంతరం సత్య కుమార్ విజయానికి ధర్మవరంలోని పలు వార్డులలో ప్రచారంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *