రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెలి వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉందని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గెలుపు కోసం ప్రచార రథాన్ని బేగంపేట్ పార్టీ కార్యాలయంలో గురువారం డాక్టర్ కోటా నీలిమ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నిలిమ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని వివరించారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.


