వైభవంగా గుంటిగంగ తిరునాళ్ల- గంగమ్మతల్లికి మొక్కులు తీర్చుకున్న భక్తులు

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగ తిరునాళ్ల గురువారం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధికసం ఖ్యలో పాల్గొని గంగమ్మతల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ కావటంతో అధికసంఖ్యలో మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కు లు తీర్చు కున్నారు. వేలాదిమందిగా వచ్చిన భక్తులు తమ మొక్కుబడులుగా గంగమ్మకు పశుజాతిని బలిఇచ్చి ఈఏడాది కరువు నుంచి ప్రజల్ని కాపాడాలని, సకాలంలో వర్షాలు కురిపించి కాపాడు గంగమ్మతల్లి అంటూ వేడుకున్నారు. భక్తులు పశుసంపదను, వాహనాలను తీసుకువచ్చి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు జరిపారు. గంగమ్మగుడి ప్రక్కనున్న నాగదేవత స్వామికి, కృష్ణమందిరం, శివాలయాలను దర్శించుకుని పూజలు చేశారు. ఆయా సామా జిక వర్గాలకు చెందిన అన్నదాన పత్రాల వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ పర్యవేక్షణలో దర్శి సీఐ షమీవుల్లా నేతృత్వంలో ఎస్ఐ వైవీ రమణయ్య ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందో బస్తు ఏర్పాటుచేశారు. పొంగళ్లు పెట్టే మహిళలు కూడా నీటి సమస్యతో ఇబ్బందులు పడకుండా నీటి వసతి ఏర్పాటుచేశారు. తేజా వృద్ధాశ్రమ ని ర్వాహకులు తిరునాళ్లకు వచ్చిన భక్తులకు ఉచితంగా మజ్జిగ అందజేశారు. సోమా పుల్లయ్య సన్స్ నిర్వహణలో శ్రీరామూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *