బేగంపేట డివిజన్ ఓల్డ్ కష్టమ్ బస్తీలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత నిధులతో పునర్నిరించిన శ్రీ పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యేతలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అమ్మవారి ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం సహకరించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహకులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, బీ ఆర్ ఎస్ నాయకులు శ్రీహరి, డివిజన్ జనరల్ సెక్రెటరీ ఆరీఫ్, అశోక్, అబ్బాస్, వహీద్, సాజిద్, ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.



