ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ బిసీ బాలుర, బాలికల వసతి గృహ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించటంపై జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారి ఎం అంజల హర్షం వ్యక్తం చేసారు.
2023-24 విద్యాసంవత్సరంలో 650 మందికి గాను 608 మంది ఉత్తీర్ణత సాధించి 93.53శాతం మంది ఉత్తీర్ణులైనట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారి ఎం అంజల గురువారం తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో ఫస్ట్ క్లాస్లు 465 మంది, సెకండ్ క్లాస్లు 110, ధర్డ్ క్లాస్లు 33 మంది సాధించారని అందులో 500మార్కులు పైన 108 మంది సాధించినట్లు చెప్పారు. ప్రభుత్వ బిసీ బాలుర వసతి గహ విద్యార్థులు జె రేవంత్ కుమార్ (589), ఎన్ వెంకట భరత్ (589), ఎం వెంకట కుశాల్ రెడ్డి (588), ఎస్ చైతన్య బాలాజీ (585), వి మోహన్ (579), ఎం రాజేష్ (577), బాలికలు ఎం మహాలక్ష్మి (579), కె జోష్నా తేజ (579) సాధించి ఉత్తమ ప్రతిభ కనపరచినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ సూచనల మేరకు విద్యార్థులకుఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాల సాధనకు కషి చేసినట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాల సాధించిన విద్యార్థులకు, సాధనకు కషి చేసిన వసతి గృహ సంక్షేమ అధికారులకు జిల్లా కలెక్టర్, బీసీ సంక్షేమ అధికారి ప్రత్యేక అభినందనలు తెలిపారు.