జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటిగంగా భవాని తిరునాళ్ల సందర్భంగా గంగాభవానీ అమ్మ వారి దేవాలయానికి ఎన్నికల కోడ్ కారణంగా భక్తులతాకిడి తక్కువగా ఉండ టంతో ఆదాయం కూడా తగ్గింది. గతంలో రాజకీయ నేతలు విద్యుత్తు ప్రభలు ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండేది. భక్తులు అమ్మ వారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించే వారు. దీంతో ఆదాయం సమకూరేది. ఈసంవత్సరం తిరునాళ్ల సందర్భంగా రూ.2లక్షల 3వేల 930 ఆదాయం వచ్చింది. తిరునాళ్ల ముగిసినం దున శుక్రవారం గంగమ్మతల్లి హుండీని, వచ్చిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. కార్యక్రమంలో కందుకూరు డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఈవో పి.కార్తిక్, ఆలయకమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
