పశువైద్యులు, సిబ్బంది పశుపోషకుల ఆదాయానికి సరియైన సేవలు అందించి వారి ఆదాయానికి సహకరించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కె బేబి రాణి అన్నారు. ప్రపంచ పశువైద్యుల దినోత్సవాన్ని పురష్కరించుకుని డీఎల్డీఏ సమావేశ మందిరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బేబి రాణి మాట్లాడుతూ పశుపోషకులు ఆధునాతన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. అనంతరం డాక్టర్ బేబి రాణి తల్లి శ్రీరామం కమలమ్మ, అత్త వరికూటి కోటమ్మల జ్ఞాపకార్థం సమతా మహిళా వేదికలో వృద్ధులకు చీరలు, టవల్స్, పండ్లు పంపిణీ చేసారు. ప్రకాశం జిల్లా ఆఫీసర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో బొమ్మరిల్లు ఆనాథ ఆశ్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బేబిరాణి చేతుల మీదుగా యూనిఫామ్ను అనాథ పిల్లలకు అందించారు. జిల్లా పశువైద్యాధికారుల అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకట రామి రెడ్డి, కోశాధికారి డాక్టర్ బసవ శంకర రావు, జిల్లా పశువైద్యుల అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ క్రిష్ణ, డీఎల్డీఏ కార్య నిర్వాహణాధికారి డాక్టర్ కాలేషా, ఒంగోలు, మార్కాపురం ఉప సంచాలకులు డాక్టర్ రమేష్, డాక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


