సంక్షేమ పథకాలు ఖచ్చితంగా తిరిగి ప్రజలకు చేరాలంటే వాసన్న ఎమ్మెల్యేగా, జగనన్న సీఎంగా అత్యధిక మోజార్టీతో గెలిపించాలని 48వ డివిజన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
ఆర్టీసీ కాలనీ, 60 అడుగుల రోడ్డులలో శనివారం 48వ డివిజన్ ఇన్చార్జిలు నరేంద్ర రెడ్డి, దిలీప్, కార్పోరేటర్ వేమూని భవాని, మాల్యాద్రి, డివిజన్ కన్వినర్లు శ్రీదేవి, డేవిడ్, వెంగయ్య, మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ విజయలక్ష్మి, పార్టీ నాయకులు వాక వెంకటేశ్వర రెడ్డి, బలిశెట్టి రాము, రామక్రిష్ణా రెడ్డి, శివరామ్, వెంకట స్వామి, రాంబాబుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి వాసన్న సారథ్యంలో ఒంగోలు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పత్రాలను అందించారు. రాబోవు మే13 ఎన్నికలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డికి తమ పవిత్రమైన ఓటును వేసి, వేయించి గెలిపించాలని కోరారు. నాయకులతో పాటు గృహసారథులు, మాజీ వలంటీర్లు పాల్గొన్నారు.


