ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ దే

రమణాల వారి పాలెం, మాధవరం గ్రామాలలో మన ఊరికి మన శివన్న కార్యక్రమం – బూచేపల్లి కుటుంబ సభ్యులకు మహిళలు హారతులు, పూలతో ఘన స్వాగతం -మ్యానిఫెస్టో అంటే జగనన్నకు దైవంతో సమానం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. మండలంలోని రమణాల వారి పాలెం, మాధవరం గ్రామాలలలో శనివారం రాత్రి మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందినీలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు హారతులు, పూలు, గజ మాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథంపై డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. ఎన్నికల సమయంలో ప్రజల కోసం రూపొందించిన మ్యానిఫెస్టోను దైవంగా భావించి అమలు చేసిన దేశ చరిత్రలో ఎకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మాట ఇస్తే నిజాయితీగా అమలు చెయ్యాలని భావించి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మ్యానిఫెస్టో రూపొందించటం జరిగిందని అన్నారు. నవరత్నాలలో భాగమైన అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఈబీసీ, కాపు, నేస్తం, మహిళల కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి అనేక పథకాలకు అదనంగా పెంచి అమలు చేసేందుకు సిద్దం అవటం పట్ల సీఎంకు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఆయన చేసిన, చేస్తున్న కృషికి నిదర్శనమన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయటమే లక్ష్యంగా అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలకు మొండి చెయ్యి చూపారన్నారు. మరో మారు అబద్ధపు మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అయ్యారని వారి మాయ మాటలు నమ్మి మోస పోవద్దని అన్నారు. ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని ఆయన బాటలో సీఎం వైఎస్ జగన్ నడుస్తూ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. అందుకే ముస్లీంలు అధిక సంఖ్యలో వైఎస్సార్స్పేకి మద్దతు తెలుపటం పట్ల హర్షం వ్యక్తం చేసారు. జగనన్నకు ఎన్నికల సంగ్రామంలో ఎదుర్కోన లేకనే కూటమి పేరుతో మూడు పార్టీలు.. మరికొన్ని పార్టీల ఒక్కటై మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. కూటమిపార్టీలు ఎన్నికుట్రలు కుతంత్రాలు పన్నినా ప్రజలు జగనన్న పక్షాన నిలచారని అన్నారు. ప్రజా బలం ముందు కూటమి పార్టీలకు ఓటమి తప్పదని అన్నారు. ఎస్సీల ఆత్మ గౌరవం కోసం విజయవాడ నడిబొడ్డున 215 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జగనన్న ఔదార్యానికి నిదర్శనమన్నారు. ఆయా కార్యక్రమాలలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి. పార్టీ అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీలు గోళ్లపాటి మోషే, పోశం మధుసూధన రెడ్డి, కోట రామి రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, చిన కాలేషా, సర్పంచిల సంఘ మండల అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డి, సర్పంచిలు వలి, కెఎస్ వెంకట రామిరెడ్డి, రమణాల వారి పాలెం, మాధవరం గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి , కైపు కోటి రెడ్డి, పాలెం శ్రీనివాస రెడ్డి, కైపు బ్రహ్మా రెడ్డి, గంధం బుజ్జి, లోకి రెడ్డి బాల క్రిష్ణా రెడ్డి, షేక్ మస్తాన్ వలి, చిన కాలేషా, తూము పెద్ది రెడ్డి, ఇడమకంటి రమణా రెడ్డి, కోట శ్రీనివాస రెడ్డి, లోకి రెడ్డి సుబ్బా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ సర్పంచి నుసుం సుబ్బారెడ్డి, గ్రామ ఉప సర్పంచి ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, సర్పంచి తాటికొండ రేణుక, అభిమానులు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *