డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని జయ ప్రదం చేయాలని కోరుతూ తహశీల్దార్ వెంకటే శ్వర్లు చేతుల మీదుగా కరపత్రాలు సోమవారం రెవెన్యూ కార్యాలయంలో దళిత సేన నాయకులు విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీన ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వర్ధంతి సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అధికారులు, దళిత సంఘాల నాయకులు, అభ్యుదయ వాదులు, దళితులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలనీ ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్, sc st bc మైనార్టీ ఐక్య వేదిక దర్శి నియోజకవర్గం నాయకులు రాచపూడి మోషే, ఉలస రవి, ప్రముఖ సంఘ సేవకులు G V రత్నం, తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నరసింహ రావు, బందీవెలిగిండ్ల VRO మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

