తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీపై ఏ మాత్రం ఉండదు

తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీపై ఏ మాత్రం ఉండదు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

2018లో తెలంగాణలో కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యారు
కానీ ఏపీలో చంద్రబాబు రెండోసారి ఓడిపోయారు
మరి పోలిక ఎక్కడ ఉంది ?

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
కొట్లాడి తెచ్చుకుంది టీఆర్‌ఎస్‌
తెలంగాణ ప్రజలు రెండుసార్లు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చాం
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు

టీఆర్‌ఎస్‌ కనీసం 30 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే గెలిచేది
ఉదాహరణకు 12 మంది ఎమ్మెల్యేలను మారిస్తే వారిలో 9 మంది గెలిచారు

కాబట్టి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్లే టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని అర్థమవుతోంది

ఏపీ విషయానికి వస్తే..

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా దూసుకుపోతున్నాడు జగన్‌

  1. పరిశ్రమలు–పెట్టుబడులు
    బాబు హయాంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్‌ పాలనలో ఇప్పటికే రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి
  2. ఉద్యోగాలు

బాబు హయాంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు–34 వేలు
జగన్‌ పాలనలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు–2.14 లక్షలు
(స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి జగన్‌ సీఎం అయ్యేదాకా రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, జగన్‌ కొత్తగా 2.14 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు)

  1. ఇళ్ల స్థలాలు–ఇళ్లు

చంద్రబాబు ప్రభుత్వం పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు
కానీ జగన్‌ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు

అందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణం మొదలుకాగా, 5 లక్షల ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులు ఇచ్చారు
మరో 5 లక్షల 2024 ఫిబ్రవరి నాటికి ఇవ్వనున్నారు
మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి

మొత్తంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం జగన్‌ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది

  1. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం
    15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు, 10 వేల విలేజ్‌ క్లినిక్స్, వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు

5.100 ఏళ్ల తరువాత సమగ్ర భూసర్వే చేపట్టారు

  1. విద్య
    నాడు–నేడు కింద 40 వేల స్కూళ్ల ఆధునీకరణ, సీబీఎస్‌ఈ, టోఫెల్‌ శిక్షణ, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ వంటి సంస్కరణలు చేపట్టి రూ.70 వేల కోట్లు ఖర్చు చేసింది జగన్‌ ప్రభుత్వం
  2. వైద్యం
    నాడు–నేడు కింద రూ.16 కోట్ల వ్యయంతో 17 మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ చేపట్టారు

ఇప్పటికే 5 మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి

53 వేల మంది మెడికల్‌ సిబ్బందిని నియమించింది

  1. డీబీటీ, నాన్‌ డీబీటీ
    లంచాలకు తావులేకుండా డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.4 లక్షలకోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లు అందించారు
    మొత్తంగా రూ.4.10 లక్షల కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూర్చారు
  2. మేనిఫెస్టోలో ఉన్న 99 శాతం హామీలను అమలు చేశారు

10) సామాజిక న్యాయం

బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని భావించి బీసీలకు పెద్దపీట వేశారు

చంద్రబాబు 8 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే, జగన్ 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు

చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు, కానీ 4 బీసీలను జగన్‌ రాజ్యసభకు పంపారు

దళితులు
చంద్రబాబు 2 దళితులకు మంత్రి పదవులు ఇస్తే, జగన్‌ 5 మంది దళితులకు(హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా) మంత్రి పదవులు ఇచ్చారు

మైనారిటీలకు, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు

కాబట్టి జనాభాలో 70 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల గుండెల్లో గూడు కట్టుకున్న సీఎం జగన్‌ గెలుపును ఎవరూ ఆపలేరు

11) వికేంద్రీకరణ
చంద్రబాబు రాజధాని పేరుతో కేవలం అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలని భావిస్తే, జగన్‌ అమరావతితోపాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయాలని అడుగులు ముందుకు వేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *