బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ తుఫాన్ ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పెనుగాలులతో కూడిన వర్షం ఎడతెరపి లేకుండ కురిసింది. పలు మండలాలలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు అయినది. చేలు, పంటలు మునిగాయి. జిల్లా వ్యాప్తంగా కోతకు వచ్చిన వరి నెలకొరిగినది. పలు చోట్ల తీవ్ర గాలులకు అరటి తోటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు మర్లపాడు, ఎం నిడమనూరు, టంగులూరు మండలాలలో పర్యటించి మినుము, శనగ, మిరప, పొగాకు, పరిస్థితిని సమీక్షించి స్థానిక వ్యవసాయ అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు.
38,483 ఎకరాల పంట నష్టం….
జిల్లాలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం వలన 38,483 ఎకరాలలలో వివిధ దశలలో ఉన్న పలు పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు జిల్లావ్యవసాయాధికారి .ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. అందులో వరి 5,478 ఎకరాలు, సజ్జ 798 ఎకరాలు, కంది 311 ఎకరాలు, మినుము 3,399, పొగాకు 20,499, నువ్వులు 128 ఎకరాలు, శనగ 7761, పెసర 35, గుర్రపు గ్రామ 7. జొన్న పంట 67 ఎకరాలు నష్టం పోయినట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు చెప్పారు. తుఫాన్ వలన ఈనెల 3 నుండి 6 వరకు కురిసిన వర్షాలకు వరి, ప్రత్తి, వేరుశనగ, పప్పుశనగ, కంది, మినుము, పెసర, చిరుధాన్యాలులలో వర్షం తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.


