ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం ఎంపీపీఎస్ పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయుడు ధనిరెడ్డి వెంకట రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కొరకు రాజ్యాంగంలో అనేక చట్టాలను చేర్చి మహిళలకు విద్య, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు అనేక అర్హతలు కల్పించారని, ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. పోతవరం సచివాలయ సెక్రటరీ శ్రీనివాసరావు, వేల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లక్ష్మయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సదానంద, డిజిటల్ అసిస్టెంట్ సుబ్బా రెడ్డి, ఉపాధ్యాయులు భాసిం, కల్పన, వీరాంజనేయులు పాల్గోన్నారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసారు.
