భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు దర్శి లో ఘనంగా జరిగాయి. దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రఘురామయ్య, దర్శిఎంపీపీ సుధారాణి అచ్చయ్య.
సంఘ సేవకులు జీవీ రత్నం, దళిత బహుజన నాయకులు ప్రేమ్ కుమార్, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ.గౌతమి గ్రామర్ స్కూల్ చైర్మన్ కేశవరెడ్డి, ప్రకృతి వైద్య నిపుణులు వైవిరెడ్డి. దళిత బహుజన రీసెర్చ్ సెంటర్ దర్శి నియోజకవర్గ అధ్యక్షురాలు కావూరి నాగమణి. సామాజిక కార్యకర్త మురికిపూడి ప్రభాకర్. వికలాంగ హక్కుల పోరాట సమితి దర్శి నియోజకవర్గ అధ్యక్షులు ఓబయ్య. తదితరులు పాల్గొన్నారు.
