దర్శి మండలంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి వైఎస్సార్ సీపీ నాయకులు పూల మాలలువేసి ఘన నివాళులర్పించారు. ఎంపీపీ సుధాఅచ్చయ్య, మార్కెట్ యార్డ్చైర్మన్ షేక్ షకీలా అమీన్ భాషా, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడుగాలిమూటి దేవప్రసాద్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడుకట్టెకోట హరీష్, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడువేమిరెడ్డి చెన్నారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి, అంకాల శ్రీను, గోవింద్ ప్రసాద్ నారాయణపాల్గొన్నారు.
