రాంగోపాల్ పేట డివిజన్ వెంగళ్ రావ్ నగర్ లోని అంగన్ వాడి టీచర్ రమ ను మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరామర్శించారు. ఈ నెల 5 వ తేదీన రమ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయి నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న ఆయన బాధితురాలు నివాసాన్ని, స్వల్పంగా దెబ్బతిన్న పక్కనే ఉన్న ఇండ్లను సందర్శించి పరామర్శించారు. ప్రమాద సమయంలో ఇంట్లో లేకపోవడం వలన ప్రాణనష్టం తప్పిందని స్థానికులు వివరించారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ BRS డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, కిషోర్, బస్తీవాసులు మల్లేష్, ఝాన్సీ, ఆషారాణి రాజు, నర్సింగ్, చంద్రమౌళి తదితరులు ఉన్నారు.



