మహిళలు తమ శక్తి యుక్తులను, సామాజిక బాధ్యతను మరింత పెంచుకోవాలని వక్తలు సూచించారు. జిల్లా నారీశక్తి సమ్మేళనం ఒంగోలులో ఆదివారం విష్ణుప్రియ కన్వేన్షన్ కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయం సత్యావాణి మాట్లాడుతూ మహిళ తన ఔన్నత్యాన్ని అన్ని రంగాలలో చాటుతుందని చెప్పారు. రాష్ట్ర పతి వద్ద నుండి శాస్త్రరంగం, కార్పోరేట్ కంపెనీలతో పాటు అని రంగాలలో శాసిస్తున్నారని చెప్పారు. స్త్రీ పరాక్రమ వంతురాలు, శక్తి వంతురాలు అని వివరించారు. న్యాయ వాది శ్రీమతి విజయభారతి మాట్లాడుతూ తనని తనను అభివృద్ధి చేసుకుంటూ కుటుంబాన్ని సమాజాన్ని దేశ నిర్మాణంలో బాగ స్వామ్యం చెయ్యాలని కావాలని కోరారు. నారీశక్తి రాష్ట్ర కోఆర్డినేటర్, జిల్లా ఇన్చార్జి సాధినేని యామిని మాట్లాడుతూ …మహిళ సమాజంలో పిల్లలను సంస్కార వంతంగా పెంచటంలో తల్లి పాత్ర, దేవాలయాలు, వృద్ధాశ్రయాలను నడపటం వంటి విషయాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళలు, యువత అందిపుచ్చుకుని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరారు. సమాజ, దేశాభివృద్ధికి కృషి చెయ్యాలని కోరారు. పలువురు మహిళలు సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలకు కారణం ఎవరు అన్న విషయాలను, ఉపాధి విషయాలు చర్చించారు. సమావేశంలో 1300 మంది మహిళలు పాల్గొన్నారు. జిల్లా కన్వినర్ విజయలక్ష్మి నారీశక్తి అమ్మాజి, పద్మావతి, స్థానిక బృందాలు పాల్గొన్నారు

