‘రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి’ అంటూ ఓ మహిళ పిలవగానే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. యశోద ఆస్పత్రిలో ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించి వెళ్తుండగా సదరు మహిళ రేవంత్ రెడ్డిని పిలిచారు. వెంటనే ఆమె దగ్గరకి వెళ్లి సమస్య ఏంటో చెప్పాలని అడిగారు. తన పాపకు ఆస్పత్రి ఖర్చు చాలా అవుతోందని, సాయం చేయాలని కోరగా వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఈ వీడియో వైరల్ అవుతోంది.
