బేగంపేట బ్రాహ్మణ వాడి లో వేస్తున్న తాగునీటి పైపులైన్ ప్రజలకు ఇబ్బంది లేకుండా వేయాలని బీ జే పీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్(నందు) అధికారులను కోరారు.సోమవారం బేగం పేట బ్రాహ్మణ వాడి లో కొత్తగా వేస్తున్న పైపు లైన్ పాత లైన్ కంటే పైకి వేస్తున్నారు అని.దీని వల్ల నీటి సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని ఈ విషయాన్ని స్థానికులు నెమలి ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న ఆనంద్ ఈ విషయాన్ని ప్రకాష్ నగర్ వాటర్ వర్క్స్ మేనేజర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.స్థానికుల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.ఆ ప్రాంతానికి చేరుకున్న వాటర్ వర్క్స్ మేనేజర్ వెంకటరెడ్డి అక్కడికి చేరుకుని పాత లైన్ కు కొత్త లైన్ కు జంక్షన్ చేస్తామని చెప్పడం తో అలా చేస్తే ప్రేజర్ విషయంలో ఇబ్బందులు ఏర్పడ వచన్న స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.దీంతో పాత పైప్ లైన్ లెవెల్ లోనే కొత్త పైప్ లైన్ వేసేలా చూస్తామని.రెండు.మూడు రోజుల్లో పనులు పూర్తయ్యేలా చూడాలంటూ సిబ్బందికి సూచించి.సమస్య పరిష్కారం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీ జే పీ ఓ బీ సీ యువమొర్చా డివిజన్ అధ్యక్షులు తారకం పెట్ శ్రావణ్.ప్రధాన కార్యదర్శి నాని. బస్తీ వాసులు రాంచందర్.పాండు.నవీన్.దేవేందర్. చింటూ లు వున్నారు.

