ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వమానవాళి జరుపుకునే ఏకైక పర్వదినం క్రిస్మస్ అని జిల్లా పరి షత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొ న్నారు. దర్శి లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సోమవారం దర్శి రిజియన్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జి. ఏసుదాసు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ బూచేపల్లి కుటుంబం క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినానికి సహకారం అందిస్తోందన్నారు. పాస్టర్లను ఘనంగా సన్మానిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపడమే నిజమైన క్రిస్మస్.. అని దర్శి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి అన్నారు. తాము కూడా తమ ఇంట్లో ఏటా బంధుమిత్రులతో కలిసి క్రిస్మస్ పండుగ జరుపుకుంటు న్నామన్నారు. బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా 20 ఏళ్లుగా దర్శి నియోజ కవర్గంలోని పేద ప్రజలకు సేవలందిస్తున్నామ న్నారు. ఏటా దర్శి నియోజకవర్గంలోని పాస్టర్ల దం పతులకు నూనత వస్త్రాలు బహూకరించడం, ఈ నెల 21వ తేదిన క్రిస్మస్ పర్వదినం మరియు ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని దర్శిలోని తమ నూతన గృహ ఆవరణలోసెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామన్నారు. పాస్టర్ల దంపతులు విధిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. ఒంగోలుకు చెందిన పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బుర్రె శ్యాంసన్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గాలిమూటి దేవప్రసాద్ మాట్లా డుతూ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దేనన్నారు. సంక్షేమ రధసారథి జగన్మోహనరెడ్డికి పాస్టర్లు క్రైస్తవులు దళిత వర్గాల ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, దర్శి రీజియన్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ రీజినల్ ప్రెసిడెంట్ పి. డేవిడ్ ఆర్సన్, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్ల మూరు, తాళ్లూరు మండలాలకు చెందిన ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షుడు బండి మార్కు, జి. కోటయ్య, దాసరి కోటేశ్వరరావు, మిరియన్, రమణారెడ్డి, సీని యర్ పాస్టర్లు నిరీక్షణ కుమార్, శ్రీరాం, ఏసుబాబు, జిఎస్ పాల్, డేనియల్పాల్, అనిల్ పాల్గొన్నారు.


