అంగన్ వాడీల నిరవధిక సమ్మె ప్రారంభంసమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు

అంగన్ వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరిచకుండా గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందనిసిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు అన్నారు . దరిశి CDPO ఆఫీసు వద్ద అంగన్ వాడీ యూనియన్ నాయకులు రావెళ్ళ అజిత అధ్యక్షతన ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ …. కార్యకర్తలు హెల్పర్స్ సమ్మె చేస్తూ స్కూల్స్ మూతవేసి పోరాటాలు చేస్తున్నారని ప్రభుత్వం చర్చించి , సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అంగన్ వాడీ కార్యకర్తల చేత ప్రభుత్వం వెట్టి చాకిరి చేయుస్తున్నదని , నిధులు తగ్గిస్తూ గర్బిణీలకు , పిల్లలకు పౌష్టి ఆహారం ఎలా అందిస్తామని అవేధన వ్యక్తం చేశారు. జగన్మోహనరెడ్డి ఎనికల ప్రచారంలో తెలంగాణా కంటే ఎక్కవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు అమలు చేయలేదని , TA, DA బకాయిలు చెల్లించం లేదని , ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలకు రిటైర్ మెంట్ ప్రకటించి , అంగన్ వాడీలను మాత్రం 60 సంవత్సరాలకే రూపాయి ఇవ్వకుండా ఇంటికి పంపుతున్నారని , కనీసం 5 లక్షలు రిటైర్ మెంట్ బెనిఫీట్ ప్రకటించాలని , ఫించన్ సౌకర్యం ఇవ్వాలని , మినీ కేంద్రాలను మార్పు చేయాలని , రాజకీయ వేధింపులు అపాలని , సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్యాడూటీ ఇవ్వాలని ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నామని , పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న కార్యకర్తల డిమాండ్స్ పై CDPO భారతి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది . ధర్నా లో సిఐటియు నాయకులు తాండవ రంగారావు , బోడపాటి హనుమంతరావు , మంజుల వాణి , షేక్ ఫాతిమా, పార్వతి , విజయవాణి , ప్రశాంతి , బాలమ్మ , విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *