ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరొక కార్యక్రమం వికసిత భారత్ సంకల్ప యాత్ర అని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అట్టడుగు పేదప్రజలకు వరకు చేరేలా, వారు లబ్ధి పొందేలా ప్రతి మండలంలోని మండల డెవలప్మెంట్ అధికారి నోడల్ ఆఫీసర్ నేతృత్వములో ఈ వికసిత భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నదని తెలిపారు. దాని కోసం ప్రభుత్వం కొన్ని ప్రచార వాహనాలను సిద్ధం చేసి ప్రతి మండలానికి పంపి కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రచారం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా సమావేశాలు ఏర్పరిచి స్థానిక ప్రజలకు తెలపాలి. అయినప్పటికీ మన ప్రకాశం జిల్లాలో వికసిత భారత్ సంకల్పయాత్ర సమావేశాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జరగడంలేదని పీవీ శివారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నామమాత్రం కార్యక్రమం చేస్తున్నారని వారు తెలిపారు.
ప్రధాని మోదీచే నవంబర్ 15న బిర్సా ముండా జయంతి ఆదివాసి గౌరవ దివస్ సందర్భంగా జార్ఖండ్ ఖుంటీ జిల్లాలో ప్రారంభించారు. నాడు ప్రధాని పేరుకున్నట్లు దేశంలో నాలుగు ప్రధానమైన కులాలు యువత, రైతులు, పేదలు, మహిళలు ఉన్నాయి, వారందరికీ ఈ యాత్ర ద్వారా జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, జన్ ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ప్రాణం యోజన మరియు యూరియా సబ్సిడీ స్కీమ్‌తో సహా 20 పథకాల యొక్క ముఖ్య ఫీచర్లు ప్రదర్శించబడతాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు వ్యాన్లు పర్యటిస్తాయి, ఆడియో-విజువల్స్, బ్రోచర్లు, కరపత్రాలు మరియు ప్రాంతీయ భాషలలోని ఇతర మాధ్యమాల ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తాయి.
స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత కార్యక్రమ చిత్రాలను వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతూ ఉందని శివారెడ్డి తెలిపారు.
వికసిత భారత సంకల్పయాత్ర 2024 జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం వరకు దేశంలోని అన్ని గ్రామాల్లో గిరిజన ప్రాంతాలలో అట్టడుగు ప్రజానీకానికి తెలిపే విధంగా నిర్వహిస్తున్నారని, కావున కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలిపే విధంగా జిల్లాలోని స్థానిక నోడల్ అధికారులు సక్రమంగా నిర్వహించాలని పేద బడుగు గిరిజన ప్రజలకు పథకాలు అందే విధంగా చూడాలని ఒక ప్రకటనలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి విజ్ఞప్తి చేశారు.
