రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యాయస్థానం ఆదేశాల మేరకు మధుర నగర్ పోలీస్ స్టేషన్ లో రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సీ ఎన్ రెడ్డి కు బెదిరింపు కాల్ చేస్తున్న విజయ సింహ పై ipc 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు,
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి నందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నాయకుడు విజయ్ సింహ తో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించిన కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి,
గతంలో కూడా విజయ్ సింహ పై బోరబండ పోలీస్ స్టేషన్ లో మరియు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి,
రోజు రోజుకి విజయ్ సింహ గుండాయిజం పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి వాళ్ల ఇంటిపై వెళ్లి దాడులు కూడా చేస్తున్నాడని,అతను చేస్తున్న గుండా ఇజంపై వార్తలు రాస్తున్నా విలేకరులను సైతం బెదిరిస్తున్నాడని విజయ్ సింహ పై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి.
