ఆరుగాలం కష్టంచి పని చేసే రైతుల ప్రయో జనాల కోసమే రైతు బజారు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్డులో రూ.80 లక్షలతో రైతు బజారు ఏర్పాటుకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లా డుతూ… రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు తక్కువ ధరలకు కూరగాయలు, సరుకులు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 46 మం ది రైతులు ఉపయోగించుకునేలా 46 రూమ్ లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు అందడమే కాకుండా రైతులు నేరుగా తమ పంటలు ఇక్కడ అమ్ముకోవచ్చని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రైతు భరోసా, రైతు లకు భీమా వంటి పథకాలు చరిత్రలో నిలిచి పోతాయని చెప్పారు. మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు బజారు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలి పారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్బా షా, నగర పంచాయతీ కమిషనర్ మహేశ్వరరావు, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి(మహేష్), రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ సుధా అచ్చయ్య, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అ ధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, వార్డు కౌన్సిల
ర్లు మేడం మోహన్ రెడ్డి జగన్నాథం మోహన్ బాబు, తుళ్లూరి బాబూరావు, ఆవుల శివారెడ్డి, జేసీ ఎస్ కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సైదా, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, నాయకులు పుట్ట రవి, జగన్, పాశం జయశింహారావు, మజ్ఞువలి, గోను నారాయణరెడ్డి, గంజి వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నారాయణ, యాతం రమణారెడ్డి పాల్గొన్నారు.

