గణపతి నవరాత్రుల్లో విద్యుత్ షాక్ తో మృతి చెందిన మండలంలోని పొట్ల పాడు గ్రామానికి చెందిన చమిడిశెట్టి శ్రీను కుటుంబానికి దర్శి శాసనసభ్యుడు డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. గ్రామంలోని గ్రామ సచివా లయం, రైతు భరోసా కేంద్రం నూతన భవనా లను ప్రారంభించేందుకు గ్రామానికి వచ్చిన ఆయన నూతన సచివాలయ భవనంలో శ్రీను కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ప్రమాదవశాత్తు కటుంబ పెద్ద మృతి చెందడం తో కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందించిన సహాయం ఆ కుటుంబానికి ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.
