నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో GHMC, వాటర్ వర్క్స్ తదితర శాఖలకు చెందిన అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతి గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ వర్క్స్, GHMC అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని హమాలీ బస్తీ, రామస్వామి కాంపౌండ్, సజన్ లాల్ స్ట్రీట్ తదితర ప్రాంతాలలో సీవరేజ్, వాటర్ పైప్ లైన్ పనులు పూర్తికాలేదని, మరికొన్ని చోట్ల ఈ పనులు పూర్తికాకపోవడం వలన రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, పుట్ పాత్ ల నిర్మాణ పనులను కూడా పూర్తిచేసి ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని అన్నారు. బేగంపేట లోని ఓల్డ్ కష్టమ్ బస్తీలో చేపట్టిన ముస్లీం గ్రేవ్ యార్డ్ నిర్మాణ పనులను కూడా మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా మంజూరైన పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో GHMC EE సుదర్శన్, వాటర్ వర్క్స్ CGM ప్రభు, DGM శశాంక్, సురేష్, సంద్యారాణి, DE బ్రహ్మరెడ్డి, టౌన్ ప్లానింగ్ ACP క్రిస్టోఫర్, డిప్యూటీ EE ఆంజనేయులు, AE లు నవీన్, ఎలెక్ట్రికల్ DE శ్రీధర్, స్ట్రీట్ లైట్స్ DE ప్రసన్న, శానిటేషన్ DE శ్రీనివాస్, AE శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.



