విద్యార్థులు చిననాటి నుండే ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకుని అది సాధించటానికి కృషి చెయ్యాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు విజయ కృష్ణన్ కోరారు. ఒంగోలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల (ఆనందనిలయం) వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి చక్కగా భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని కోరారు. విద్యార్థులకు ప్రభుత్వం మంచి వసతి, విద్య అందిస్తుందని చక్కగా ఉపయోగించుకొని రాణించాలని సూచించారు. వసతి గృహంలో మోను, వసతి, శుభ్రత పై విద్యార్థులకు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మోను పట్ల, విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేయటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసారు. వసతి గృహ సంక్షేమ అధికారిణి దుర్గా లక్ష్మిని కూడ అభినందించారు. ఆమె వెంట జిల్లా డిప్యూటి డైరెక్టర్ ఎన్ లక్ష్మా నాయక్, సహాయ సాంఘిక అధికారి ఉదయశ్రీ, వసతి గృహ సంక్షేమాధికారులు సంఘ జిల్లా అధ్యక్షుడు డి అంకబాబులు పాల్గొన్నారు.



