ప్రతి పేద విద్యార్థి విద్యావంతుడు కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆకాంక్షించారు. దర్శి నియోజకవర్గంలో పలు మండలాల్లో బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. దర్శి మండలం లో… దర్శిఅంబేడ్కర్ గురుకుల పాఠశా లలో 10వ తరగతి విద్యార్థులకు బుధవారం ఆమె దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసా దరెడ్డితో కలిసి స్టడీమెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లల్లో విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. అందుకోసం తమ బూచేపల్లి వెంకాయమ్మసుబ్బారెడ్డి ట్రస్టు ద్వారా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులకు మూలం పదో తరగతి అని, అం దులో అందరూ మంచి ర్యాంకులో ఉత్తీర్ణులు కావా లనే ఉద్దేశంతో మెటీరియల్ అందజేస్తున్నట్లు దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలి పారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశా లలోని 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ అంద జేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు ఆల్న్ వన్ స్టడీమెటీరియల్ అందజేశారు. తాళ్లూరు మండలం లో… ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నత చదువులు చది వించడమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్టడీ మెటీరియల్ ను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . ప్రతి విద్యార్థి కష్ట పడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుంద న్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మో హన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్నారన్నారు. అదే పాఠశాలలో చైర్ పర్సన్ వెంకాయమ్మ చదివిన రోజులను గుర్తు చేసు కున్నారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. హెచ్ఎం సుబ్బారావు, జిల్లా కోఆప్షన్ మెంబెర్ షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి ), మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ మందా సామ్సన్, నాగం బొట్లపాలెం సర్పంచ్ సుబ్బారావు, ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాలకోటయ్య, పి ఎం సి చైర్మన్ వై కృష్ణారెడ్డి, పులి రామిరెడ్డి , రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కురిచేడు మండలంలో… పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ను ప్రధానోపాధ్యాయులు ఎం.బు ల్లెమ్మ, ఉపాధ్యాయులు కలిసి బుధవారం పంపిణీ చేశారు. స్టడీమెటీరియల్ను జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా అందజేశారు. 20 ఏళ్లుగా నియోజకవర్గంలోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఉపాధ్యాయులు జున్ను రవికుమార్, వెంకటేశ్వర్లు, ఎం.సుబ్బారెడ్డి, శరత్, స్వర్ణలత, లక్ష్మి, సుజాత, అం జమ్మబాయి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.






