అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. స్థానిక కొత్తపాలెంలోని అయ్యప్పస్వామి ఆలయం లో మహిళలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె బుధవారం దర్శి మాజీ శాసనస భ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ అయ్యప్ప స్వామి ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజల్లో అన్న దానంపై మక్కువ పెరుగుతుందన్నారు. దివంగత దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారని, ఆ తర్వాత అది అంతటా వ్యాపించి ప్రతి గ్రామంలో అన్నదానం జరగటం శుభపరిణామమన్నారు. అయ్యప్పస్వామి ఆలయంలో మహిళలు ముందు
కొచ్చి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చటం కన్నా పుణ్యకార్యమేముంటుందని బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అయ్యప్పస్వామి మాలధారణ


