పొగాకు బోర్డు సూచనలకు అనుగుణంగా పొగాకు పంటను సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడి, సీడింగ్ తీస్తున్న ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామరైతు నవులూరి సురేంద్రమోహన్ రావు కు ఉత్తమ సాగు రైతు అవా ర్డుకు ఎంపికయ్యారు. రాజమండ్రిలో సెంట్రల్ పొగాకు టుబాకో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్థాపించి 75 ఏళ్లు దాటిన సందర్భంగా పొగాకు పంటను ఏటా సాగు చేస్తున్న సురేంద్ర మోహన్ రావు కృషిని ఆ సంస్థ గుర్తిం చింది. అందులో భాగంగా రాజమండ్రిలో బుధవారం ఆయనకు బోర్డు చైర్మన్ సిహెచ్.యశ్వంత్ కుమార్, సీటీఆర్ డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్, అసిస్టెంట్ జనరల్ డైరెక్టర్ డీకే యాదవ్ లు దుశ్శాలువా కప్పి సత్క రించి మెమెంటో అందజేశారు. అవార్డు పొందిన సురేంద్ర మోహన్ రావు కు పలువురు బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.
