రైతుల వేషంలో వచ్చిన ఏసీబీ అధికారులు రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా విఆర్ ఒను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన ముండ్లమూరు తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగింది. ముండ్లమూరు మండలంలోని నాయుడుపాలెం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న రావూరి రవిశంకర్ ఇటీవల
గ్రామానికి ఇన్ఛార్జి వి.అర్ .ఓ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ కు చెందిన నారాయణనన్, సత్యవతి మరియు టి.మనోహర్ పోలవరం గ్రామంలో 20 738/15 0-66 0, 739/2 0-22 మొత్తం 0-88 సెంట్లను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిపై తమ పేర్లతో పాస్ బుక్ మంజూరు చేయాలని ఈ నెల ఏడున తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పని కోసం గ్రామ రెవెన్యూ అధికారి రూ.40 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని భూయజమానులు ఒంగోలులోని అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బుధవారం తహశీల్దార్ వారి కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి రవిశంకర్ కు ఫిర్యాదుదారులు లంచం ఇస్తుండగా రైతుల వేషంలో ఉన్న ఏసీబీ అధికారులు రెడ్యోండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన రవిశంకర్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు. దాడులలో ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, సిఐలు సిహెచ్ శేషు, అపర్ణ, పీవీ శ్రీనివాసరావు, ఎస్సై నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
