ప్రతి ఒక్కరి సహకారం, సమిష్టి కృషితోనే తాను సనత్ నగర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో శాసనసభ్యుడిగా గెలుపొందానని మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం అమీర్ పేటలోని BRS పార్టీ కార్యాలయంలో టిల్లు బాయ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపు కోసం ఎంతో శ్రమించిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. మీకు ఏ అవసరం వచ్చినా ఎల్లవేళలా మీకు అండగా ఉంటాననే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. అనంతరం మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పలువురు ఆశా వర్కర్ మహిళలకు చీరలు, పలువురు యువకులకు రెయిన్ కోట్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు మధు, బాగిందర్ సింగ్, సుమిత్ సింగ్, కూతురు నర్సింహ, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, హరిసింగ్, రాజేశ్వరి, అనిత, లక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.



