జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయంలో అదనంగా బ్రహ్మణ పూజారిని నియమించినట్లు ఆలయ ఈఓ పి కార్తిక్ తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం, మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావులు శుక్రవారం లాంఛనంగా పూజా టిక్కెట్స్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. సోసైటీ చైర్మన్ యాడిక యలమందా రెడ్డి, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ పులి బ్రహ్మా రెడ్డి, మాజీ సర్పంచి పులి క్రిష్ణా రెడ్డి, ఎంఎల్డీ మల్లేశ్వర రెడ్డి, జయ రామి రెడ్డి, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనూరి దేవదానం తదితరులు పాల్గొన్నారు.


