ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 56 రోజుల పాటు నిరహార దీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు భారత రత్న అవార్డు ఇవ్వాలని వాసవి క్లబ్ అధ్యక్షుడు చీదేళ్ల వెంకట ప్రసాద్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని వాసవి క్లబ్, కెసిసిఎఫ్ యూత్ సంయుక్తంగా సీతారాంపురంలో శ్రీ వాసవి విద్యా నిధి ఆర్యవైశ్య బాలుర వసతి గృహ ప్రాంగణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కేశవ స్వామి పేటలో ఆలయముల వద్ద పేదలకు, యాచకులను అల్పాహారాన్ని పంపిణీ చేసారు. క్లబ్ బాధ్యులు గుర్రం రంగనాథ్, దర్శి మనోహార్, చీదేళ్ల వెంకట ప్రసాద్, ఎల్చూరి నగేష్ గుప్తా. జంధ్యం, నేరేళ్ల శ్రీనివాసరావు, నూకల శ్రీనివాసరావు, కూనలశ్రీనివాస రావు, సామి సత్యనారాయణ, వాసవి విద్యానిథి, వసతి గృహం కమిటీ కార్యదర్శి నూనే రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
బిజేపి ఆధ్వర్యంలో …..
స్థానిక సివిఎన్ రీడింగ్లూమ్ వద్ద గత అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. బిజేపి ఒంగోలు అసెంబ్లీ కన్వినర్ యోగయ్య యాదవ్, నగర అధ్యక్షులు రంగనాథం, శ్రీరాములు, పార్లమెంటు కన్విసర్ సెగ్గం శ్రీనివాసరావు, జిల్లా మీడియా ఇన్చార్జి ధనిశెట్టి రాము, మైనార్టీ మోర్చ బాధ్యులు సుబాని, జిల్లా ఐటీ సెల్ కన్వినర్ గుర్రం సత్యనారాయణ, సీనియర్ నాయకులు కనుమల రాఘవులు. పిన్నంటి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

