జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి దరఖాస్తుల ఆహ్వానం

సామాజికంగా, ఆర్థికంగా బలహీనమైన వెనకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సా హకం అనే నూతన పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారిత అధికారి ఎన్ లక్ష్మానాయక్ తెలిపారు. యూపీఎ సీసీ నిర్వహించే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారి కోసం ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి రూ.లక్ష నగదు ప్రోత్సాహకం, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రూ.50 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తారని తెలిపారు. 2023 యూపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీ క్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులు రూ.50 వేల నగదు ప్రోత్సాహకం కోసం దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మెయిన్స్ పరీ క్షలో అర్హులైన అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులుwww.jnanabhumi.ap.gov.in పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసు కోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్ కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *