అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగుల కొట్టిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు శని వారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ దర్శి నియో జకవర్గ కార్యదర్శి టి. రంగారావు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందో ళనలు చేస్తుంటే ప్రభుత్వం అణిచివేత చర్యలకు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆ ర్వోలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, సచివాలయం పోలీ సుల ద్వారా కేంద్రాల తాళాలు పగులకొట్టటం దారుణమన్నారు. కేంద్రాల్లో రికార్డులు, సరుకులు మాయమైతే అందుకు వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. కార్యకర్తల ఉద్యమానికి టీడీపీ, సీపీఎం, సీపీఐలతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు సంపూర్ణ మద్దతు అందించాయి, ఈ కార్యక్రమంలోఆయా పార్టీల నాయకులు మాడపాకుల రమేష్‌బాబు, కె హనుమంతరావు, యు. నాగేంద్రం, ఎం. శోభా రాణి, సందు వెంకటేశ్వరరావు, హనుమంతరావు, ఈ. నాగేశ్వరరావు, అచ్చమాంబ, వెంకటరమణ, వాణి, అజిత, పార్వతి తదితరులు పాల్గొన్నారు.




